Eenadu Property Show: అక్టోబరు 30, 31 తేదీల్లో హైటెక్స్‌లో ‘ఈనాడు ప్రాపర్టీ షో’ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ (Real Estate) చరిత్రలోనే తనకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకున్న ‘ఈనాడు ప్రాపర్టీ షో’ (EENADU Property Show) మరలా మీ ముందుకు వచ్చేసింది. ఇప్పటికి ౩1 ఎడిషన్స్ విజయవంతంగా నిర్వహించిన ‘ఈనాడు ప్రాపర్టీ షో’ తన 32వ ఎడిషన్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో అక్టోబరు 30, 31 తేదీల్లో నిర్వహిస్తోంది. ఇది హైదరాబాద్ (Hyderabad) నగరంలో అతి పెద్ద ప్రాపర్టీ షోగా నిలవనుంది. మీ అన్వేషణ ప్రీమియం విల్లా అయినా, బడ్జెట్ హౌస్ అయినా, ప్లాట్స్, ఫ్లాట్స్ అయినా, మీ కలలను నిజం చేసుకునే సువర్ణ అవకాశం ‘ఈనాడు ప్రాపర్టీ షో’. ఇప్పుడు దేశం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తోంది. కొత్త సంవత్సరంలో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఊపందుకున్నాయి. గృహ, రుణ వడ్డీ రేట్లు తగ్గడంతో, రుణాలు తీసుకుని ఫ్లాట్లు, విల్లాలు, స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో వీటన్నింటికి విపరీతమైన డిమాండ్ వచ్చింది. నగరం చుట్ట్టూ వివిధ కొత్త ప్రాజెక్టులు వస్తుండడం, ప్రభుత్వాలు కూడా వీటికి ప్రాధాన్యం ఇస్తుండడంతో, పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెడుతున్నాయి